1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మీరాతో మలయాళ నిర్మాతల కట్..!

సాధారణంగా ఎవరికైతే ప్రతిభ ఉంటుందో.. వారికి పొగరు ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. అలాంటి వారు చిత్ర పరిశ్రమలో
WD PhotoWD
సాధారణంగా ఎవరికైతే ప్రతిభ ఉంటుందో.. వారికి పొగరు ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. అలాంటి వారు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంటారు. ఆ కోవలోకి వచ్చే వారిలో.. మలయాళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ ఒకరు. దీంతో ఆమె ఇటీవలి కాలంలో ఎక్కువ చిక్కుల్లో పడుతున్నారు. ఈ పొగరు కారణంగా.. ఇచ్చిన కాల్షీట్లకు అనుగుణంగా సినిమా షూటింగ్‌లకు వెళ్లని సంఘటనలు అనేకం ఉన్నాయి. అందువల్ల ఆ నిర్మాతలు పలు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా.. అనుకున్న సమయానికి తమ చిత్రాల షూటింగ్‌లను పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది.

దిలీప్ హీరోగా రూపొందుతున్న 'కొల్‌కతా న్యూస్' అనే సినిమా మీరా జాస్మిన్ పుణ్యమాని ఆలస్యమై నిర్మాత నష్టాలలో కూరుకుపోయేలా చేసింది. ఈ సినిమా దర్శకుడు బ్లెస్సీనే మీరా జాస్మిన్‌ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అది మరిచిపోయిన మీరా జాస్మిన్ 25 రోజులు సినిమా షూటింగ్‌కు హాజరుకాకపోవడంతో నిర్మాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దీంతో.. మీరాతో ఇకపై మలయాళ నిర్మాతలు ఎవరూ చిత్రాలు చేయరాదని నిర్ణయం తీసుకున్నారట.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి