1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నమితపై ఎగబడిన అభిమానులు

తమిళ సెక్సీ క్వీన్ నమితను చూసేందుకు ఎవరైనా కాదంటారా? అదీ ఆమె ఒంటరిగా కంటపడితే ఇకేముంది. అభిమానులకు పూర్తిగా నేత్రానందమే
WD PhotoWD
తమిళ సెక్సీ క్వీన్ నమితను చూసేందుకు ఎవరైనా కాదంటారా? అదీ ఆమె ఒంటరిగా కంటపడితే ఇకేముంది. అభిమానులకు పూర్తిగా నేత్రానందమే. బెంగుళూరు ఎయిర్ పోర్టులో అదే జరిగింది. కన్నడ సినిమా షూటింగ్ కోసం ఇటీవల బెంగుళూరు వెళ్లిన నమితను గుర్తుపట్టిన అభిమానులు ఆమెను ఎయిర్ పోర్టులోనే చుట్టుముట్టేశారట. ఆటోగ్రాఫ్‌లంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఆమె మీదకి ఎగపడ్డారట. దీన్ని తట్టుకోలేకపోయిన నమిత వారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక సాయం కోసం పెద్దగా అరిచిందట.

అవేమీ పట్టించుకోని అభిమానులు ఇంకా తోసుకుంటూనే నమితను ఊపిరిపీల్చుకోకుండా చేశారట. అరుపులు మరింత పెంచడంతో అప్రమత్తమయిన ఎయిర్ పోర్టు భద్రతాధికారులు అభిమానుల తాకిడి నుంచి ఆమెను కాపాడారట. అంతేకాకుండా.. ఆమెను సురక్షితంగా కారు ఎక్కించి మరీ పంచించారట. ఎంతైనా నమిత.. నమితే కదా..!
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి