1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

సెక్సీతారను ఇబ్బంది పెడుతున్న అభిమానుల చూపులు

అటు తమిళం
WD PhotoWD
అటు తమిళం, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో సెక్సీతారగా గుర్తింపు పొందిన హీరోయిన్లలో నమిత ఒకరు. అయితే.. ఈ గుర్తింపే ఆమెకు ఇపుడు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. పూటకో పుకారుతో నమిత విసుగెత్తి పోవడమే కాకుండా.. ఆమెను తెగ ఇబ్బంది పెట్టేస్తోందట. అదేనండీ... ఆమెకు ఏదైతే గుర్తింపు తెచ్చిపెట్టాయో.. ఆ ఎద సంపద (బాడీ సైజు)ను తగ్గించుకోవడానికి ట్రీట్‌మెంట్ చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పుకార్లు కోడై కూస్తున్నాయి.

అసలు ఆమెకు అభిమానులు ఇంతగా ఉన్నారంటే దానికి కారణం.. నమిత ఆరడగుల ఎత్తు, ఎద సంపద వల్లే అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి అందాలను ఇపుడు తగ్గించుకుంటే ఎలా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారట. ప్రస్తుతం ఆమె బాడీ సైజు 42 ఇంచ్‌లు దాటడంతో ఆమె ట్రీట్‌మెంట్‌కు నిర్ణయం తీసుకుందన్నదే చెన్నై కోడంబాక్కం వర్గాల పుకార్లు.

స్టేజ్ మీదకు వెళ్లగానే జనాలందరూ యెదసంపదవైపే చూస్తుండడం నమితకు తీవ్ర ఇబ్బందిగా ఉందట. అందుకే ట్రీట్‌మెంట్ కోసం మలేషియా వెళ్లాలని కూడా నిర్ణయించుకుందని, ఇంతకుముందు నయనతార కూడా అక్కడే తన బాడీని తగ్గించుకుందని చెపుతున్నారు. నయనతార, నమితలు మంచి స్నేహితురాళ్లు కావడంతో నయనతారే నమితకు ఈ సలహా ఇచ్చి ఉంటుందని చెన్నై సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి