1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మీరా ''ముద్దు'' ముచ్చట్లు

ముద్దు సన్నివేశాలు ఎక్స్ పోజింగ్ మీరాజాస్మిన్
WD PhotoWD
ముద్దు సన్నివేశాలకు, ఎక్స్‌పోజింగ్ దృశ్యాలలో నటనకు నో చెప్పే కథానాయకలలో మీరాజాస్మిన్ కూడా ఒకరు. అయితే ఆమధ్య తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యతో కలిసి ముద్దు సన్నివేశంలో నటించి ఒకింత ఆసక్తిని రేకిత్తించింది. మళ్లీ మరోసారి ఇదే పంథాను మీరా జాస్మిన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

భరత్ నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'నేపాలి'లో మీరా ముద్దుసన్నివేశంలో పాల్గొన్నదని కోలీవుడ్ సినీ న్యూస్. నటనలో భాగంగా వెండితెరపై 'నటన' ముద్దులు మామూలే కదా అంటున్నారు కొంతమంది సినీ జనం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT