''చిరుత'' భామ మహా ముదురట..!
|
మొదటి షెడ్యూల్‌లో నేహ, ఆమె ప్రియుడు మన్ను షూటింగ్ లొకేషన్‌లో యూనిట్‌ను ఎంతో ఇబ్బందులు పాలుజేశారట. తమ ఆహారం, బస విషయంలో వారిద్దరూ ప్రొడక్షన్ యూనిట్‌ను, దర్శకుడిని ముప్పతిప్పలు పెట్టారని వినికిడి.
దీంతో విసుగెత్తిన దర్శకుడు పూరిజగన్నాథ్ మొదటి షెడ్యూల్ పూర్తికాగానే హీరోయిన్ నేహాను మార్చేందుకు ప్లాన్ చేశాడట. అప్పటికే ప్రకాష్ రాజ్, నేహా కాంబినేషన్‌లోని అన్ని షాట్స్ పూర్తికావడంతో విధిలేక నేహాను కొనసాగించాడని చిత్ర యూనిట్ ఇపుడు చెప్పుకొస్తోంది. ఎంతైనా మోడల్ కదా మరీ.!
