ఆగ్రహంతో ఊగిపోతున్న సెక్సీతార
|
కింగ్ ఆఫ్ మ్యారేజ్‌గా పేరు గడించిన లియాకత్ అలీ వెల్లడించిన వార్తలు తమిళ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. నగ్మా, మీనా, నమితలతో తనకు దగ్గరి స్నేహం ఉందని, ఈ ముగ్గురిలో నమిత మరింత దగ్గరి స్నేహితురాలని లియాకత్ బాంబు పేల్చాడు.
దీనికి తట్టుకోలేక పోతున్న నమిత తీవ్ర ఆగ్రహంతో తనపై వచ్చిన వార్తలను కొట్టిపడేస్తోంది. ఆయనతో నాకెలాంటి సంబంధాలు లేవని, అవసరమైతే ఆయనపై కోర్టులో దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అయితే.. నటీమణులపై ఆలీ చేసిన ఆరోపణలు నిరూపించాల్సింది పోలీసులే మరి. అప్పటి వరకు ఈ వార్తలు మాత్రం చెన్నై కోడంబాక్కం వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది.
