1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఆ రెండింటికి మినహా దేనికైనా సిద్ధం..!

చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి నిన్నటి వరకు.. ఆ హీరోయిన్ ఈ రెండు రకాలుగా చేసేందుకు ఎంతో మోజు
WD PhotoWD
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి నిన్నటి వరకు.. ఆ హీరోయిన్ ఈ రెండు రకాలుగా చేసేందుకు ఎంతో మోజు పడేది. అసలు ఆమెకు సెక్సీ తారగా ముద్ర పడింది కూడా వాటివల్లే. అయితే ఇపుడు ఆ రెండు రకాలు మినహా ఇతర ఎలాంటి వాటికైనా సిద్ధమని కండిషన్లు పెడుతోంది. ఆమె సెక్సీతార నమిత. నాటి నుంచి నిన్నటి వరకు బికినీలు వేసుకునేందుకు, లిప్‌ కిస్‌లు పెట్టేందుకు సై అంటూ అందరికంటూ ముందు వరుసలో ఉన్న ఈ నటి.. ప్రస్తుతం ఈ రెండింటికి దూరంగా ఉండాడలని నిర్ణయం తీసుకుంది.

అందులో భాగంగానే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్‌తో ఇంతకుముందే నటించిన నమితకు తాజాగా ఆయనతో నటించే అవకాశం వచ్చింది. సినిమా పేరు 1977. చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది కానీ తాజాగా కొత్త రకం కండీషన్లు పెట్టిందట. అవేమిటంటే.. బికినీ వేసుకోనని, లిప్‌ కిస్‌లు పెట్టనని, అయితే సింగిల్ స్విమ్ స్యూట్ వేసుకొని నటించడానికి మాత్రం ఓకే అందట. రాడాన్ పిక్చర్‌పై శరత్ కుమార్ భార్య రాధికా ఈ చిత్రాన్ని తీయనున్నారు.
About Writer
PNR