కోలివుడ్ తారల పాలిట విలన్‌గా మల్లికా షెరావత్..!
|
మన భామలు తమ అందాలను మరీ అంతగా చూపించేందుకు వెనుకంజ వేస్తారు. అయితే.. ముంబై భామలు మాత్రం ఎంతకైనా, ఎలాంటి దుస్తులనైనా ధరించేందుకు సై అంటున్నారు. ఇదే తారల మధ్య పోటీకి దారీ తీస్తోంది. ఇందుకు ఉదాహరణగా.. మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న 'అతిథి' చిత్రంలో మల్లికా అరోరా ఓ ఐటం సాంగ్‌లో అరకొర దుస్తుల్తో అందాలను ఆరబోసిందట.
అలాగే.. తమిళంలో కమల్ హాసన్ హీరోగా తీస్తున్న 'దశావతారం' చిత్రంలో మల్లికాషెరావత్ అతి పలుచనైనా దుస్తులు ధరించినట్టు కోడంబాక్కం వర్గాలు భోగట్టా. ఇలా నటిస్తే తమిళం, తెలుగు చిత్ర సీమలకు చెందిన హీరోయిన్ల పరిస్థితి ఏమిటో కాలమే సమాధానం చెప్పాలి.
