1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మెగాస్టార్ రెండో కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం

టాలీవుడ్‌లో కలెక్షన్ల రికార్డులు నెలకొల్పడంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూ.. వార్తల్లో కనిపించే మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని బుధవారం వివాహమాడింది. న్యూ బోయినపల్లిలోని ఆర్యసమాజంలో స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. గత నాలుగేళ్ళుగా తామిరువురం ప్రేమించుకుంటున్నట్టు శ్రీజ ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

టాలీవుడ్‌లో కలెక్షన్ల రికార్డులు నెలకొల్పడంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూ.. వార్తల్లో కనిపించే మెగాస్టార్ చిరంజీవి, ఇటీవలి కాలంలో కుటుంబ వ్యవహార విషయాల్లోను వార్తలకెక్కుతున్నారు. పెద్ద కుమార్తె నిశ్చితార్థం మొదలు సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ మొదటి వివాహం తాలుకూ వివాదం కోర్టు మెట్లకెక్కడం తదితర అంశాలు సద్దుమణగక ముందే.. చిరంజీవి ద్వితీయ కుమార్తె శ్రీజ హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

దీంతో భాగ్యనగరంతో పాటు.. తెలుగు చిత్రపరిశ్రమలో శ్రీజ ప్రేమ వివాహం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వివాహానంతరం శ్రీజ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్థానికంగా న్యాయవాది కుమారుడైన చంద్రశేఖర భరద్వాజ్‌ను బోయినపల్లిలో వివాహం చేసుకున్నట్టు వెల్లడించింది. అయితే.. ఈ అంశంపై చిరంజీవి కుటుంబం ఇంతవరకు స్పందించలేదు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి