1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

గ్లామర్ రోల్సా..!! అమ్మో నేను చెయ్యను..!!

తెలుగు అమృతవర్షం చిత్రం పరిచయం డ్రీమ్ గేళ్ రమ్య. గ్లామర్ పాత్రలు నో అమృతవర్షం
తెలుగులో "అమృతవర్షం" చిత్రంలో పరిచయమైన "డ్రీమ్ గేళ్" రమ్య.. గ్లామర్ పాత్రలకు "నో" అంటోందట. అమృతవర్షంలో సమీర్ దత్తానీ చెంతన నటించిన రమ్య అనంతరం కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లిటిల్ సూపర్ స్టార్ సింబు సరసన నటించిన రమ్య ప్రస్తుతం "ధనుష్" చెంతన "పొల్లాదవన్" చిత్రంలో అందాలను ఆరబోసిందట.

అయితే అది నిజం కాదని కథకు తగ్గట్టు మితంగానే నటించానంటోంది అందాల భామ రమ్య. ఇకపై గ్లామర్ రోల్స్‌‌ చేయనని.. ఒక తమిళ చిత్రంలో ఓ సాంగ్‌కు కాస్త గ్లామరస్‌గా నటించానంతేనని అంటోంది.

కానీ ఆమెను గ్లామర్‌ గేల్‌‌గానే ఎక్స్‌పోజ్ చేస్తుండటంతో.. ఇకపై కోలీవుడ్‌లో గ్లామర్ రోల్స్‌కు రమ్య పుల్‌స్టాప్ పెట్టబోతుందట. అంతేకాకుండా ఇటువంటి పాత్రలు తన ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని చెబుతోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుసగా మరో రెండు చిత్రాలు, కన్నడంలో ఉపేంద్ర, గణేష్‌లకు జంటగా మరో చిత్రంలో రమ్య నటిస్తోంది.