1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ రంగ ప్రవేశం..!!?

తెలుగు సినీ పరిశ్రమ ఒక స్థానం మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్  రంగ ప్రవేశం ఇటీవల సామాజిక సేవలు
WD PhotoWD
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సోదరుడు "పవన్ కళ్యాణ్" రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల సామాజిక సేవల్లో నిమగ్నమైన పవన్ కళ్యాణ్ బ్లెడ్ బ్యాంకులు వంటి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్‌సత్తాలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. అంతేకాకుండా పవన్ అభిమానుల ఆదరణతో ఓ ప్రత్యేక ఛారిటీని స్థాపించనున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఓ బ్లెడ్ క్యాంప్‌కు జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. అయితే పవన్ ఇప్పటి వరకు ఈ అంశంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

అయితే.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించమని రాజకీయ పార్టీలు, చిరు అభిమానులు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన కుమార్తె వివాహం వివాదస్పదంగా తలెత్తిన విషయం తెలిసిందే. దీనితో చిరు రాజకీయ ప్రవేశం వార్తలు కనుమరుగయ్యాయి. ఇక వీరిరువురిలో రాజకీయాల్లోకి ఎవరు ప్రవేశిస్తారో... వేచి చూడాల్సిందే.