ఆ వార్తలన్నీ అవాస్తవం: ప్రకాష్ రాజ్
|
నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా సినీ రంగంలో రాణిస్తున్న ప్రకాష్ రాజ్ కోలీవుడ్‌లో "మొళి", ఆసై, వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించేందుకు కోటి రూపాయలను డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి.
ఈ వార్తలన్నీ అవాస్తామని చెప్పారు. అంతేకాకుండా.. తాను ఒర నటిని రెండో వివాహం చేసుకున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఒట్టి పుకార్లేనని ప్రకాష్ స్పష్టం చేశారు. తనకు వివాహమై భార్య, పిల్లలు ఉన్నారని చెప్పారు.
