మమతతో రొమాన్స్ నో అంటున్న దేవిశ్రీ
|
అయితే మమతకు, తనకు మధ్య ఎలాంటి ప్రేమలు, దోమలు నడలేదంటూ దేవిశ్రీ బుకాయిస్తున్నాడు. ఆమె మంచి నటీమణురాలని, తాజాగా విక్రమ్ చిత్రం కందసామిలో కూడా నటిస్తోందని మాట తిప్పేస్తున్నాడీ సంగీతం దర్శకడు.
నిజానికి మమతా తెలుగు తెరకు రావడానికి ముందు ఆమెలో నటే కాదు గాయని కూడా ఉందని గుర్తించి తొలి సారి తన సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం కల్పించాడు దేవిశ్రీ.. ఆమె ఇప్పటివరకు పాడిన పాటలు ప్రేక్షకులను వెర్రెత్తిస్తున్నాయి. అలాగే యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్‌తో నటించి అబయా... అంటూ అందరికీ గుర్తుండిపోయాలా నటించింది.
