కమ్ముల సెంటిమెంట్ కమలిని
|
ఆనంద్ (ఓ మంచి కాఫీ లాంటి సినిమా) చిత్రంతో తెలుగు తెరపై గుర్తింపు పొందిన కమలిని ఆతర్వాత కమ్ముల తీసిన చిత్రం గోదావరిలోను దర్శనమిచ్చింది. అలాగే తాజాగా విజయం సాధించిన చిత్రం హ్యాపీడేస్‌లోను ఓ టీచర్‌గా కమలిని దర్శనమిచ్చింది.
సో దీన్ని బట్టి కమలిని అంటే కమ్ములకు మంచి సెంటిమెంటేమో... ఏ చిత్రంలోను వదలడం లేదు. మరో విషయమండోయ్... త్వరలో కమ్ముల మరో కొత్త చిత్రానికి నాంది పలుకబోతున్నట్లు... ఆ చిత్రంలోను కమలిని తీసుకుంటున్నట్లు సినిమా వాడల్లో తెగ హోరెత్తుతున్నాయి.
