1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

దీపకతో షారుఖ్ ముద్దు గొడవ

దీపక షారుఖ్ ముద్దు గొడవ
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్‌ఖాన్ ఇటీవల నటించిన ఓం శాంతి ఓం చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అయితే షారుఖ్ కూడా బయట సంతోషంగా ఉన్నప్పటికీ కాస్త బాధతో ఉన్నాడు. ఏంటా అని ఆరా తీస్తే ఓం శాంతి ఓంలో నటించిన దీపికా పడుగొనేను ముద్దు పెట్టుకోకపోవడమేనని పెదవి విరుస్తున్నాడు.

ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ముద్దు సీన్ పెడదామని ఆలోచించాడట... అయితే ఆమె పొడగరి కావడంతో ఆ సీన్ బాగోదని తన ఆలోచనను మార్చుకున్నాడట పాపం... షారుఖ్. కాని మరో వైపు ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి దీపికాకు ఏదో ఎఫైర్ ఉందని ఈ మధ్య తెగ పుకార్లు వచ్చాయి.

దీనికి తోడు ధోనీ కూడా అవేమీ లేవంటూనే ఆ వార్తలు బాగున్నాయంటూ తెగ మెచ్చేసుకున్నాడు. మరి ధోనీకి షారుఖ్ విషయం తెలిస్తే... ఎంత ఆనందపడతాడో...
About Writer
Hanumantha Reddy