1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

శాంతి పూజల్లో నిమగ్నమైన మెగాస్టార్..!

తెలుగు చలన చిత్రంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న మెగాస్టార్.. శాంతి పూజల్లో నిమగ్నమైనట్టు
FileFILE
తెలుగు చలన చిత్రంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న మెగాస్టార్.. శాంతి పూజల్లో నిమగ్నమైనట్టు సమాచారం. తన కుటుంబ జ్యోతిష్య పండితుల సూచన మేరకు ఈ పూజలు నిర్వహిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల భొగొట్టా. తెలుగు చిత్ర పరిశ్రమలో నానాటికీ పెరుగుతున్న తన ఇమేజ్‌పై దిష్టి తగిలిందని అందువల్లే ఇటీవలి కాలంలో కష్టాలు ఎదుర్కొంటున్నట్టు వినికిడి.

వీటి నుంచి త్వరగా విముక్తుడయ్యేందుకు వీలుగా.. గ్రహశాంతి పూజ, నరదోష, ఇతర రకాల పూజలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తాను తదుపరి నిర్మించనున్న 149 చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి