1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

''పోకిరి'' ఇలియానాతో ''పవర్''స్టార్ తంటాలు

పోకిరి ఇలియానా పవర్ స్టార్ తంటాలు పవన్ కల్యాణ్
'పోకిరి' ఇలియానా పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెడుతూనే ఉంది. అదెలాగంటారా... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'జల్సా'‌లో పవన్ కల్యాణ్, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ 'జల్సా' చిత్రానికి అంగీకరించిన డేట్ల ప్రకారం షూటింగ్‌కు హాజరు కావటంలో ఇలియానా విఫలమతోంది. పైగా తనకు పరీక్షలున్నాయనీ, తన సోదరి వివాహానికి హాజరవ్వాలని... ఏవేవో చెపుతోందంటున్నారు.

దీంతో అనుకున్న ప్రకారం కొత్త సంవత్సరం జనవరిలో విడుదల చేయాలనుకున్న చిత్రం వాయిదా పడే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఎంత 'జల్సా' చిత్రంలో నటిస్తున్నప్పటికీ ఇలియానా ఇలా షూటింగ్‌ను ఎగ్గొట్టి జల్సాగా తిరగటం సమంజసమేనా....? అని పెదవి విరుస్తున్నారు కొందరు సినీ జనాలు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT