1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో ఎన్టీఆర్

పవన్ కళ్యాణ్ అడుగు జాడలు ఎన్టీఆర్
ఆది చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ తనేదైనా చేయగలనని నిరూపిస్తున్నాడు. సింహాద్రి చిత్రం తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఎన్టీఆర్‌కు పేరు తెచ్చి పెట్టలేకపోయాయినా యమదొంగ చిత్రంతో మళ్లీ రికార్డు సృష్టించాడు. సాధారణంగా గత చిత్రాల్లో లావుగా కనపడిన ఎన్టీఆర్ తాజాగా విడుదలైన యమదొంగలో మాత్రం సన్నగా కనపడి ప్రేక్షకులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు.

అయితే ఈ మధ్య తన పంథాను సరికొత్త రీతిలో మార్చి.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాటను పట్టినట్లున్నాడు. తాను నటించబోవు చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్‌గా కనిపించడం కోసం హాంగ్‌కాంగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో హోరెత్తుత్తున్నాయి. అంతే కాదండోయ్ హాంగ్‌కాంగ్‌లోనే కొన్ని పాటలకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరణ చేస్తున్నారు.

దీంతో చలన చిత్ర సీమలో తాను ఏదైనా చేయగలను అని ఎన్టీఆర్ నిరూపిస్తున్నాడు. చలన చిత్ర జీవతం కోసం తాను ఏదైనా సాధించగలనని కూడా ఈ యువ హీరో చాటిచెబుతున్నాడు. ఓకే ఎన్టీఆర్ విష్ యు ఆల్ ది బెస్ట్....
About Writer
Hanumantha Reddy