ప్రధాన పేజి   వినోదం > వెండితెర > గుసగుసలు
 
అతిథి మిర్చీకి శేఖర కమ్ముల దర్శకత్వం..?
Mahesh
WD PhotoWD
తెలుగు చలన చిత్రంలో సరికొత్త ట్రెండ్‌లతో ప్రేక్షకుల్లో అందులోను యువతలో పూర్తి మార్కులు కొట్టేసిన హీరో మహేష్ బాబు. ఇటీవల తాజాగా విడుదలైన మహేష్ చిత్రం అతిథి తర్వతా మిర్చి చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

విభిన్న చిత్రాల దర్శకుడే కాక స్వల్ప కాల వ్యవధిలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసే శేఖర కమ్ములను మిర్చీ చిత్రానికి దర్శకత్వం వహించాలని అడగినట్లు ఫిలిం నగర్‌లో హోరెత్తుతున్నాయి. ఈ చిత్రానికి ఎక్కువ సమయం తీసుకోకూడదని భావించిన మహేష్ శేఖర్‌ను ఎంపిక చేసిన భోగట్టా.

ఏది ఎలా ఉన్నా.... ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై రూపొందించాలని మాత్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతే కాదండోయ్ పొకిరి చిత్రం తర్వాత అనూహ్యమైన క్రేజ్‌ను తన స్వంతం చేసుకున్నాడు మహేష్. ఇప్పుడు మిర్చీ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ కోసం తెగ వెతికేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని
పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో ఎన్టీఆర్
అందంకోసం శ్రేయ పాట్లు...
'పోకిరి' ఇలియానాతో 'పవర్'స్టార్ తంటాలు
శాంతి పూజల్లో నిమగ్నమైన మెగాస్టార్..!
దీపకతో షారుఖ్ ముద్దు గొడవ
కమ్ముల సెంటిమెంట్ కమలిని