1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఏదీ ఓ ఆట వేయండి చూద్దాం

కత్రినాకైఫ్ అక్షయకన్నా చెస్ క్రీడ ఆసక్తి
IFM
చెస్ ఆటలో తనకు తిరుగేలేదంటోంది కత్రినాకైఫ్. ఈ ఆటలో ఎవరైనా తన ముందు ఓటమిపాలవాల్సిందేనటోందీ ముద్దుగుమ్మ. అకాస్మాత్తుగా ఈ చెస్ గొడవ ఏంటని అనుకుంటున్నారా.... ఈ‌మధ్య బాలీవుడ్ తారలు తమకు షూటింగ్ మధ్య కాస్తంత టైమ్ దొరికితే చాలు.... ఏదో ఒక ఆట ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారట.

ఇదే వరుసలో మొన్నామధ్య... అక్షయకన్నా వద్ద కత్రినాకైఫ్ చెస్ పాటాలు నేర్చుకుందట. వారిద్దరూ చెస్ ఆటలో నిమగ్నమైపోవటంతో యూనిట్ సభ్యులకు అది కాస్త వినోదంగా మారిందట. ఆ ప్రక్కనే ఉన్న సైఫ్ ఆలీఖాన్ సైతం 'ఏదీ ఓ ఆట వేయండి, చూద్దాం..' అంటూ ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ముందుకు వచ్చాడట.

చెస్ ఆట సంగతేమోగానీ... బిపాసా, సమీరా రెడ్డి వంటి సెక్సీతారలు కూడా ఇటీవల తమ సహచర నటులతో కలిసి టైమ్ దొరికినప్పుడల్లా సరదాగా క్రీడా కాలక్షేపం చేస్తున్నారట. అవును మరి.. ఎంతసేపు డ్యాన్సులేనా... మెదడుకు పదును కూడా అవసరమేగా
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి