బోయ్స్ చిత్రంతో యువతను ఆకట్టుకునే పాత్రలో తెరంగ్రేట్రం చేసిన జెనీలియా... ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించినంత స్థాయిలో పేరు సంపాదించలేకపోయింది. అయితే ఆమె నటించిన బొమ్మరిల్లు చిత్రం సూపర్ హిట్ అయింది. వెంటనే ఢీ చిత్రం కూడా అదే తరహాలో మంచి ఆదరణను పొందడంతో చిత్రాల ఎంపికలో జెనీలియా తెగ జాగ్రత్త వహిస్తోంది.
ఆమెకు ఒక్క సారిగా హిట్లు రావడంతో ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నట్లు కనపడుతోంది. దానికి ఉదాహరణే మిస్టర్ మేథావి చిత్రం.. ఎందుకంటే ఈ చిత్రం టైటిల్ విషయంలో దర్శకుడు నీలకంఠ వివిధ పేర్లను పరిశీలించారు. అయితే చివరికి జెనీలియా ఎంపిక చేసిన టైటిల్‌నే ఖరారు చేయవలసి వచ్చినట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఈ సందర్భంగా మీరీ మధ్య అన్ని విషయాల్లో ఇన్‌వాల్వ్ అవుతున్నారని విన్నామని జెనీలియాను కదిలిస్తే... సినిమా పరంగా ఎంత మేరకు కల్పించుకోవాలో అంత మేరకు అవుతున్నట్లు సమాధానమిచ్చింది.. తనకీ మధ్య చాలా ఆఫర్లు వచ్చాయంట... అయితే అవన్నీ బొమ్మరిల్లు చిత్రంలోని పాత్ర తరహావేనని, అయితే తాను వెరైటీ కోరుకుంటున్నట్లు తెలిపింది.
జీవితంలో మనం ఎలా వెరైటీ కావాలని కోరుకుంటామో.. అలాగే తాను కూడా చిత్రం విషయంలోను వెరైటీ కోరుకుంటున్నట్లు తెగ చెప్పుకుంటోంది. అంతే కాదండోయ్ మిస్టర్ మేధావి చిత్రంలో తన చుట్టూనే కథ తిరుగుతుందని స్టైల్‌గా చెబుతోంది.. పాపం దర్శక నిర్మాతలు ఇంకే చేద్దాం అంటూ... అడ్జెస్ట్ అయిపోతున్నారు.
|