2008 సంవత్సరం రావటానికి మరో 26 రోజులు సమయం ఉంది. కొత్త సంవత్సరం సమీపిస్తున్నకొద్దీ ఆ ఏడాదిలో ఏం చేయాలన్నదానిపై ప్రణాళికలు వేసుకోవటం సహజమే కదా. మెగాస్టార్ చిరంజీవి త్వరలో.. అంటే జనవరి 2008లో కొత్త పార్టీ స్థాపించనున్నారని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా మరో వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. అదేమంటే... టెన్నిస్ తార సానియా మీర్జాకు వెండితెరపై కనిపించేందుకు తనకు ఎటువంటి సందేహం లేదని చెప్పిందన్న విషయం. ఆమె నిజంగా నటిస్తుందో లేదో కానీ... ఆమధ్య బాలీవుడ్ నటుడు షారుఖ్‌తో సన్ ఫీస్ట్ ఓపెన్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దాదాపు అందరూ సానియా సినిమాల్లో కనిపించే తరుణం వచ్చేసిందనుకున్నారు. అయితే అది 'అనుకోవటం' వరకే మిగిలిపోయింది.
కానీ ఈసారి మాత్రం సానియా నిజంగానే నటించే అవకాశం ఉందన్న స్థాయిలో టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అసలు విషయం తెలియాలంటే నూతన సంవత్సరం వచ్చేదాకా ఆగాలి మరి...
|