1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

హాట్ హాట్ దుస్తుల్లో అమృత

అమృతారావు హాట్ హాట్ దుస్తులు సెక్సీ నటన
IFM
మహేష్ బాబు 'అతిథి'లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ సెక్సీతార అమృతారావు... గోవా సముద్రతీరాన సహారామోషన్ పిక్చర్స్ వారి చిత్రానికి సంబంధించి షూటింగ్‌లో హాటుహాట్‌గా కన్పించే దుస్తులు ధరించి నటించిందట.

అంతేకాదు ఆ దుస్తుల్లో 'తుమ్ మిలే....' అన్నపాటకు అమృత స్టెప్పులేసి... తన సహచర నటులను సైడ్ చేసేసిందట. అక్కడున్నవారు అమృత స్టయిల్‌లో ఏదో కొత్తదనం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని గుసగుసలాడుకున్నారట.

తన లేటెస్ట్ గెటెప్ గురించి అమృతను కదిలిస్తే... ప్రతి చిత్రంలోనూ ఒకే విధంగా కనిపిస్తే... ఏం బావుంటుంది చెప్పండి. అంతెందుకు రోజూ పచ్చడి వేసుకు తినగలమా...? అలాగే పచ్చడిని కాదని రోజూ పరమాన్నంతో భుజించగలమా... అని ఎదురు ప్రశ్నలు వేసిందట. ఏదేమైనా తనకంటూ ప్రత్యేక స్టయిల్ ను క్రియేట్ చేసుకునే ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించింది కనుక స్టయిల్‌‌లో ఆ మాత్రం మార్పు తప్పకుండా వస్తుంది కదూ...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT