ప్రధాన పేజి   వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను ఒంటరిగానే ఉన్నా: కత్రినా
Katrina
FILE
సల్మాన్‌కు రాశి కలిసి వచ్చినట్లు లేదు. అతనితో జతకడతారనుకున్నవారంతా దూరమై పోతున్నారు. ఇటీవల కత్రినాకైఫ్ సల్మాన్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగిందన్న విషయం విదితమే కదా. బాలీవుడ్ ఫిలిమ్ ఫంక్షన్లలో చాలా సార్లు వీరిద్దరూ కలిసి కనబడ్డారు కూడా. అయితే ఈమధ్య సల్మాన్ జైలు పాలయిన దగ్గర్నుంచీ.... కత్రినాలో మార్పు వచ్చినట్లు కనబడుతోంది.

సల్మాన్ గురించి మీడియా ఏవైనా అడిగితే... ఆ సంగతి పక్కన పెట్టి, తాను ఒంటరిగా ఉన్నానని అంటూ పరోక్షంగా సల్మాన్‌తో తెగతెంపులు అన్న విషయాన్ని ఇలా చెపుతోందట. మరోవైపు అక్షయ్ కుమార్‌తో సన్నిహితంగా మెలగటం వల్ల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు బాలీవుడ్‌లో గుసగుసలు సైతం వినవస్తున్నాయి.

వీటన్నిటినీ కత్రినా పట్టించుకునే దశలో లేదు. తన వ్యక్తిగతం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే... తను నటిస్తున్న, నటించబోయే సినిమాల గురించి కబుర్లు చెపుతోందట. మరి కత్రినా "కటీఫ్" గురించి సల్మాన్‌ని అడిగితే ఏం చెపుతాడో మరి.
మరిన్ని
హాట్ హాట్ దుస్తుల్లో అమృత
టాలీవుడ్ వెండితెరపై టెన్నిస్ తార...?
సినిమాలో వెరైటీ కోరుకుంటా: జెనీలియా
శ్రీరామదాసులో సీత పాత్ర... బ్యాంక్‌లో సెక్సీ పాత్ర
ఏ యాంగిల్‌లో సెక్సీగా ఉండనో చెప్పండి: నమిత
బాలీవుడ్‌లో మరో ప్రేమకథకు "తెర"..!