1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నన్ను ముద్దుపెట్టుకోందే వదలరు

ప్రియమణి తొలిరాత్రి సన్నివేశాలు ముద్దు సన్నివేశాలు
WD
నటి ప్రియమణి ముద్దంటే చేదా! అంటూ దానికి కొత్త అర్థాన్ని చెబుతోంది. 'అతడెవరు' అనే చిత్రంతో తెలుగు సినిమాలో ప్రవేశించిన ప్రియమణికి అప్పట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత 'పెళ్లయిన కొత్తలో' అంటూ ముందుకు వచ్చి... అందులో తొలిరాత్రి సన్నివేశాల్లో నటించింది. అయితే ఆ సన్నివేశాల్లో పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయకపోయినా గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్స్‌పోజింగ్ చాలా ఎక్కువగా ఉంది.

ఈ సందర్భంగా మీరు ముద్దుసీన్లో నటిస్తారా? అని ప్రశ్నిస్తే.... దానికి లాజిక్‌గా ఇలా వివరణ ఇచ్చింది. ఇంటికి వెళితే నాన్నగారు నన్ను ముద్దుపెట్టుకుంటారు. అది కూతురుగా నా మీద ఉన్న వాత్సల్యం. అలాగే నా గర్ల్ ఫ్రెండ్స్ కలిసినప్పుడల్లా ప్రతిసారీ ముద్దులు పెట్టుకోందే నన్ను వదలరు. అది ఫ్రెండ్స్‌షిప్ విషెస్... వింతగా ఉందా... ఇదంతా కల్చరండీ బాబు.... హాలీవుడ్ ఆప్యాయతలు ఇలాగే ఉంటాయి అంటూ మనమూ హాలీవుడ్ లెవల్‌కి ఎదిగామంటూ పరోక్షంగా చెప్పిందీ ముద్దుగుమ్మ.

ఇంతకీ ముద్దు గురించి ఇంత లెక్చర్ ఇచ్చిందంటే... ధనుష్‌తో 'అదుబరు కనాకాలం' అనే తమిళ చిత్రంలో లిప్ టు లిప్ కిస్ ప్రభావమేమో.... ఇటువంటి ముద్దుగురించి ప్రియను కదిలిస్తే... ప్రేమికులు ఎవరైనా కలిస్తే పుట్టే భావం అలానే ఉంటుంది మరి... అంటోంది. ఇదండీ కిస్ గురించి మిస్ ప్రియ అభిప్రాయం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT