మాళవిక.. ఈ పేరుకు దక్షిణ భారత చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు వుంది. హీరోయిన్‌గా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేని మాళవిక... ఐటం సాంగ్‌లలో నటించి దక్షిణ భారత భాషలతో పాటు.. బాలీవుడ్‌లోను ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇటీవలే ముంబై పారిశ్రామికవేత్తను పెళ్లాడిన ఈ సుందరాంగి.. ఈ మధ్య కాలంలో ఐటం సాంగ్‌లలో నటించడం ఎక్కువైంది.
తమిళం, మళయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఆమెకు అవకాశాలు పుష్కలంగా వస్తూన్నాయి. అయితే.. తాను ఒక పాటలో నటించినప్పటికీ.. ముందుగా కుదుర్చుకున్నట్టుగా పారితోషం ఇవ్వాల్సిందేనని, లేని పక్షంలో ఆ పాట షూటింగ్ ఆపేయాల్సిందేనని తెగేసి చెప్పేస్తోంది. అందులో నటించే హీరోతో పాటు.. భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ తనకేం భయం లేదని అంటోంది. ఇందుకు ఉదాహరణ కూడా చెప్పుకొచ్చింది ఈమె.
ఒక బాలీవుడ్ చిత్రంలో ఐటం సాంగ్‌లో నటిస్తుండగా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పైసలు ఇవ్వలేదు. దీంతో సినియాలో సాంగ్ చేసేందుకు నిరాకరించి పెట్టేబేడా సర్ధుకుని చెన్నైకు వచ్చేశాను. ఆ తర్వాత చిత్ర నిర్మాత చెన్నైకు వచ్చి పైసలు సెటిల్ చేసిన తర్వాత షూటింగ్ పూర్తి చేశానని గర్వగంగా చెపుతోంది.
ఐటం సాంగ్ చేసే హీరోయిన్లను కొందరు నిర్మాతలు చిన్న చూపుతో చూస్తున్నారని అందువల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అనుకున్నట్టుగా పారితోషం ఇస్తే.. ఎలాంటి ఐటం సాంగ్‌లనైనా చేసేందుకు సిద్ధంగా ఉందట. తాజాగా "కురువి" అనే తమిళ చిత్రంలో విజయ్ సరసన ఓ ఐటం సాంగ్ చేస్తోంది.
|