హిందీ "పోకిరి" ఛాన్స్ కొట్టేసిన అయేషా టకియీ!
|
ఇదిలావుండగా హీరోయిన్‌గా ఆసిన్ నటిస్తుందని తొలుత భావించారు. ఆమె ప్రస్తుతం తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుండటంతో పోకిరి చిత్రానికి కాల్షీట్లు ఇవ్వలేని పరిస్థితి ఉత్పననమైనట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల వినికిడి. ఆసిన్ తమిళంలో 'దశావతారం', 'వేల్', హిందీ 'గజని' చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో 'పోకిరి' చిత్రంలో హీరోయిన్‌గా 'సూపర్' హీరోయిన్ అయేషా టకియాను ఎంపిక చేశారట. ఈ చిత్రాన్నిఅలనాటి నటి శ్రీదేవి భరత్ బోనీ కపూర్ నిర్మిస్తుండగా, ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.
