'శివాజీ' చిత్రంలో హీరోయిన్‌గా నటించి దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ శ్రియ. అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో నటిస్తూ.. బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈ హీరోయిన్ ఇటీవల ఒక తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేసిందట. అదీ కూడా ఏ పెద్ద హీరో చిత్రంలో అయితే ఫర్వాలేదు. తమిళ కామెడీ కింగ్ వడివేలు హీరోగా నటిస్తున్న చిత్రం "ఇందిర లోగత్తిల్ నా అజగప్పన్" అనే పౌరాణిక చిత్రంలోనట.
ఈ నటుడు లోగడ హీరోగా నటించిన "హింసై అరసన్ ఇరువదాం పులకేసి" అనే చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాను హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో శ్రియతో ఐటం సాంగ్ చేయించడం వడివేలు మంచితనానికే చెల్లిందని వినికిడి.
ఈ విషయం తెలుసుకున్న కొంతమంది తమిళ హీరోలు కామెడీ హీరో చిత్రంలో శ్రియ ఐటం సాంగ్ చేయడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారట. అయితే నాలుగున్నర నిమిషాల నిడివిగల ఆ పాటకు శ్రియ.. ఏడు సంఖ్యల మొత్తాన్నే పారితోషకంగా తీసుకున్నట్టు చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. దటీజ్ శ్రియ.
|