గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » "సెక్సీ క్వీన్" కేసు విచారణ వాయిదా!
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FileFILE
బాలీవుడ్ 'సెక్సీ క్వీన్' మల్లికా షెరావత్‌పై ముంబైలోని బంద్రా కోర్టులో దాఖలైన కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీలో ఆమె చేసిన శృంగార నృత్యంపై పెద్ద దుమారమే చెలరేగింది. తన అందచందాలను పూర్తిగా చూపిస్తూ.. చేసిన నాట్యానికి సుమారు కోటి రూపాయలను మల్లికా తీసుకున్నట్టు సమాచారం.

అయితే డ్యాన్స్ ఫోటోలను విడుదల చేయకూడదని ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారట. కానీ.. ఆ నక్షత్ర హోటల్ యాజమాన్యం మాత్రం.. గుట్టుచప్పుడు కాకుండా ఫోటోలను పత్రికల వారికి విడుదల చేసింది. దీంతో.. వినోద్ జైన్ అనే సంఘ సేవకుడు బంద్రా కోర్టులో మల్లికపై కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కేసును మంగళవారానికి వాయిదా వేసింది.

నక్షత్ర హోటల్‌లో జరిగిన పార్టీలో మల్లికా షెరావత్ భారతీయ సంస్కృతిని మంట గలిపే విధంగా దుస్తులు ధరించి, నర్తించారని పేర్కొన్నారు. ఇందుకు సాక్ష్యంగా ఆయన పత్రికల్లో ప్రచురితమైన ఫోటోలను జత చేశారట. దీంతో.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మల్లిక నానా తిప్పలు పడుతున్నట్టు బాలీవుడ్ వర్గాలు భొగొట్టా.