గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » ఐటం సాంగ్‌ "శివాజీ"తోనే చేస్తా: నయనతార
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FileFILE
హామ్లీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నయనతార ఒకరు. అయితే ఈ మలయాళ ముద్దుగుమ్మ ఒక తమిళ యువహీరోతో ప్రేమలో పడిన తర్వాత సినీ అవకాశాలు తగ్గపోయాయి. ఎక్కడో అడపాదడపా వచ్చినా ఆవి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. దీంతో తన హోమ్లీ గుర్తింపునకు స్వస్తి పలికి బికినీలు వేయడం అలవాటు చేసుకుంది. బికినీలతో తాజాగా కనిపించిన తమిళ చిత్రం "బిల్లా". ఈ చిత్రంలో నయనతార గ్లామర్‌కు మంచి పేరే వచ్చింది.

అలాగే.. తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "తులసి" చిత్రంలో కూడా నయనతార తన అందాలను బాగానే ఆరబోసింది. అయితే.. "శివాజీ" హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన శ్రియ ఓ తమిళ చిత్రంలో హీరో కమ్ కమెడియన్ వడివేలుతో ఐటం సాంగ్‌లో నటించింది. ఆ కోవలోకి వచ్చేందుకు నయనతార కూడా సమ్మతించింది. అయితే.. 'శివాజీ' హీరోతోనే ఐటం సాంగ్‌ చేస్తానంటోంది. అదీ డబ్బుల కోసం కాదట. మరి ఎందుకో ఈ మలయాళ ముద్దుగుమ్మనే అడగాలి.