మరో సంచలనానికి రజనీ-శంకర్ శ్రీకారం!
|
అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆటకెక్కింది. దీంతో.. దర్శకుడు శంకర్ తమిళ సూపర్ స్టార్‌ను సంప్రదించగా, ఆయన సమ్మతించినట్టు కోలీవుడ్ వర్గాలు భోగొట్టా. సూపర్‌స్టార్‌తో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా తుది దశకు చేరుకోలేదని శంకర్ సన్నిహితులతో చెప్పినట్లు కోడంబాక్కం సమాచారం. తాజాగా ఈ చిత్రాన్ని ముంబైకు చెందిన ఎరోస్ ఇంటర్నేషనల్, అయంగరన్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
ప్రాజెక్టుకు అనుసంధానకర్తగా ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం వ్యవహరించనున్నారు. ఈ చర్చలు సఫలీకృతమైతే.. రజనీ-శంకర్ కాంబినేషన్‌లో వచ్చే తదుపరి చిత్రం దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందే చిత్రంగా రికార్డు పుటలకెక్కనుంది. ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చే ఈ చిత్రానికి బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ దీపికా పడుకొనేను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు శంకర్ నిర్ణయించినట్టు వినికిడి.
