మ్ముఁ ..మ్ముఁ.. ముద్దుకు "సై" అంటున్న స్నేహా
Publish: Fri, 18 Jan 2008 (13:10 IST)
Updated: Fri, 18 Jan 2008 (13:10 IST)
అందమైన ముఖం, చిక్కటి నవ్వుతో ఇట్టే ఆకర్షించే హీరోయిన్ స్నేహా. గ్లామర్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే శృంగారభరిత సన్నివేశాలకు, ముద్దు సీన్లకు మాత్రం ఆమడదూరంలో ఉండే ఈ భామ.. తాజాగా ఆ కోవలో చేరింది. హీరోలతో సూపర్ డూపర్ హిట్స్‌తో కూడిన డ్యూయట్ పాటల్లో నర్తించినప్పటికీ... వొంపు సొంపులను ఆరబోయక పోవడం వల్ల కలిగే నష్టాన్ని ఇటీవలే గ్రహించింది. దీంతో తాజాగా దర్శక నటుడు చేరన్ హీరోగా నటించిన తమిళ చిత్రం "పిరివోం సందిప్పోం" (విడిపోదాం.. కలుసుకుందాం) అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన స్నేహా కొన్ని ముద్దు సీన్లలో నటించిందట. ఇలా తన తొలి ముద్దును చేరన్‌కు రుచిచూపించిన స్నేహ ఇక మరింత గ్లామర్‌గా కనిపించడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ముద్దు సీన్లను అంగీకరించక పోవడం వల్ల జరిగిన నష్టాన్ని తెలుసుకోవడం వల్లే స్నేహా ఇందుకు సై అన్నట్టు సమాచారం.