ప్రేమ వివాహం చేసుకున్న ''చిరు'' తనయుడు?
|
అయితే చిరంజీవి రాజకీయ రంగ ప్రకటన చేస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో కొందరు కావాలనే ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని చిరు సన్నిహుతులు పేర్కొన్నారు. ఈ ఒక్క విషయాన్ని కాకుండా.. చిరు కుటుంబానికి చెందిన ప్రతి చిన్న విషయాన్ని సైతం ఇలా బూతద్ధంలో చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పుకార్ల వెనుక చిరంజీవి వ్యతిరేకుల హస్తం వుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
"చిరుత" కోసం పడిగాపులు కాచిన మీడియా
చిరుత హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు శక్రవారం గుప్పుమన్న ఊహాగానాలు రాజధానిలో సంచలనం సృష్టించాయి. ఈ వార్తను విన్న మీడియా ప్రతినిధులు చిరు కుటుంబ సభ్యుల వద్ధకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని చిరు కుటుంబ సభ్యులు పెదవి విప్పక పోవడంతో మీడియా ప్రతినిధుల మధ్య మరింత ఉత్కంఠత నెలకొంది.
అంతేకాకుండా.. రామ్ చరణ్ తేజ, నేహా శర్మలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్టు వార్తలు రావడంతో మీడియా అంతా విమానశ్రయానికి చేరుకుంది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో రామ్ చరణ్ తేజ్ నగరంలోనే ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో వున్నట్టు సమాచారం అందడంతో మీడియా ఊపిరిపీల్చుకుని, విమానశ్రయం నుంచి ఎవరిదారిన వారు వెళ్ళి పోయారు.
