1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అందమంతా ఆ కళ్లలోనే ఉన్నది....

ఇలియానా త్రివిక్రమ్ మోజు సినీ వర్గాలు పవన్ కళ్యాణ్
'దేవదాసు' లో తన అందాలతో కుర్రకారుని ఊరించిన ఇలియానా అంటే ఎవరికి మోజు ఉండదు. ఇక దగ్గరుండి దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్‌కు చెప్పలేని వ్యామోహం ఉందని ఇండస్ట్రీ వర్గాలు గుసుగుసలాడుకుంటున్నాయి. ఆమె కళ్లు తనకెంతో నచ్చాయని త్రివిక్రమ్ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్లు సమాచారం. అందుకే పవన్ కళ్యాణ్ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తుంటే హీరోయిన్ ఇలియానా ఉంటే బావుంటుందని అడిగాడట.

ఇంతవరకూ అమే చేసిన చిత్రాలన్నీ ఓ ఎత్తైతే ఈ చిత్రంలోని తన గ్లామర్‌ వాటిని మించి ఉంటుందని త్రివిక్రమ్ అంటున్నాడు. అంతగా ఆకట్టుకున్న ఇలియానాకు తన తదుపరి వరుడు చిత్రంలోకూడా అవకాశాన్ని ఇచ్చేశాడు. ఇలియానా గ్లామర్ దెబ్బకు చిత్తవుతున్న వారి వరుసలో ఇప్పుడు దర్శకులు కూడా చేరిపోతున్నారన్నమాట.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT