గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » "రోబో" ఫోటో సెషన్‌లో పాల్గొన్న రజనీ
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోనే భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న చిత్రం "రోబో". ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ అందాలతార, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యువ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీత బాణీలను సమకూర్చనున్నారు. అయితే.. చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

కానీ 'రోబో' చిత్రం ఫోటో సెషన్ మాత్రం జరిగింది. రజనీ-ఐష్‌లతో జరిగిందని అనుకుంటే పొరబడినట్టే. ఈ చిత్రంలో రజనీకాంత్ పోషించనున్న పాత్ర, దాని తీరుతెన్నులపై శంకర్-రజనీలు చర్చించారు. ఆ తర్వాత రజనీ మాత్రమే పాల్గొన్న ఈ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఐష్ బచ్చన్ మాత్రం అనివార్య కారణాల వల్ల పాల్గొనలేదు.

ఐష్‌తో మరో దఫా ఫోటో సెషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు దర్శకుడు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా 'రోబో'లో యాక్షన్ కింగ్ నటించనున్నట్టు వచ్చిన వార్తలను కేవలం పుకార్లేనని తేలిపోయాయి. ఈ చిత్రంలో తాను నటించడం లేదని అర్జున్ స్పష్టం చేశారు.