1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

"దశావతారం" ఆడియో విడుదలలో జాప్యం!

పద్మశ్రీ కమల్ హాసన్
FileFILE
పద్మశ్రీ కమల్ హాసన్, ఆసిన్, మల్లికాషెరావత్‌లు నటిస్తున్న "దశావతారం" చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు. అంతేకాకుండా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగే స్థలాన్ని కూడా నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలిమ్స్ మార్చింది. తొలుత నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టారు. తాజా సమాచారం ప్రకారం నందనంలోని వైఎంసీఏ మైదానంలో దీన్ని నిర్వహించనున్నారు. అయితే కార్యక్రమానికి వచ్చే అతిధుల్లో మాత్రం మార్పు లేదని ఆ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

హాలీవుడ్ నటుడు జాకీ చాన్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్, చిత్ర హీరో కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ పాల్గొనున్నారు. వీరే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్‌లను ఆహ్వానించేందుకు కూడా చర్చలు సాగుతున్నాయి.

ఇప్పటికే ఆడియో హక్కులను కైవసం చేసుకున్న సోనీ ఆడియో సంస్థ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను కూడా భారీగానే చేస్తున్నారు. 'దశావతారం' ఆడియో హక్కుల ధర కూడా తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు పలుకని రికార్డు స్థాయికి అమ్ముడు పోవడం కోలీవుడ్‌ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి