తన్మయత్వంలో వాళ్లిద్దరు..
|
"నగరం" చిత్రం షూటింగ్ నగరంలో జరుగుతోంది. అందులో వాళ్లిద్దరు ఒకరినొకరు గాఢంగా హత్తుకుని తన్మయత్వం చెందాలి. అంతకుముందే కావేరిని ఎత్తుకుని నీళ్లలో పడేశారు. ఆ తర్వాత ఒకరినొకరు కళ్ళలో చూసుకుంటూ తన్మయం చెందాలి. ఈ సీన్‌లో వాళ్లిద్దరు నటించారు అంటే పొరపాటే. వాళ్లిద్దరు జీవించారు. ఇది నిజం. సీన్ ముగిసిన తర్వాత దర్శకుడు కట్ చెప్పినా వాళ్లిద్దరు మాత్రం విడిపోలేదు.
రెండో సారి కట్.. మూడో సారి కట్.. ఇలా కట్‌లు చెపుతున్నా హీరోహీరోయిన్లు మాత్రం అలానే వున్నారు. చివరకు ఏం చేసేది లేక దర్శకుడు కొందరు యూనిట్ సభ్యులను ఐదు అడుగుల నీటిలో వున్న వాళ్లిద్దరి వద్దకు పంపి మన లోకంలోకి వచ్చేలా చేశారు. పాపం.. శ్రీకాంత్-కావేరిఝా. వచ్చిన గోల్డెన్ అవకాశాన్ని దర్శకుడు చెరిపేశారని మనస్సులో తిట్టుకుని ఉంటారేమో?! అయితేనేం.. వాళ్లిద్దరు (శ్రీకాంత్, కావేరిఝా) మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారట. మరోసారి అవకాశం రాకపోతుందా? అని. షూటింగ్ స్పాట్ ఎంతైనా బహిరంగ ప్రదేశం కదా.!

