సముద్ర దర్శకత్వంలో "సత్యభామ"
|
లోగడ సముద్ర దర్శకత్వంలో వచ్చిన 'ఎవడైతే నాకేంటి' చిత్రం ఘన విజయం సాధించగా, ఆ తర్వాత వచ్చిన 'విజయదశమి' పూర్తిగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో సముద్ర మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తన తదుపరి చిత్ర ప్రధాన పాత్రలో భూమికను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. అలాగే ఈ చిత్రంలో మురళి అనే కుర్రాడు తొలి సారి హీరోగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం తారకరత్న హీరోగా 'వెంకటాద్రి' అనే చిత్రానికి సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
