దీపామెహతా దర్శకత్వంలో "శ్రియ"
|
ఈయన "ఫైర్", "వాటర్" వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే. ఈ వార్తలు నిజమైతే శ్రియ... అమీర్ ఖాన్, నందితాదాస్, జాన్ అబ్రహాం వంటి దిగ్గజాల సరసన చేరుతుంది. వీరంతా దీపామెహతా దర్శకత్వంలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.
ఇదిలావుండగా... సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్న ఈ తాజా చిత్రం షూటింగ్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైంది. ఇందులో సీమా బిశ్వాస్ కూడా ఒక పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం శ్రియ.. విక్రమ్ హీరోగా నటిస్తున్న "మల్లన్న" అనే చిత్రంలోనే నటిస్తోంది.
