1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

కమిలినీ తెరవెనుక అందాలు

కమిలినీ ముఖర్జీ తెరవెనుక అందాలు సినిమా
నటీమణులు తెరపైకన్నా తెరవెనుక బాగా కనువిందు చేస్తారనటానికి కమిలినీ ముఖర్జీ ఉదాహరణగా చెప్పుకోవచ్చని కృష్ణ నగర్ సినీజీవులు అంటున్నారు. 'ఆనంద్'లో చీరకట్టినా, 'గోదావరి'లో కనిపించినా, లేటెస్ట్‌గా 'గమ్యం'లో చుడీదార్ వేసినా అది సినిమాకే పరిమితమని తెలుస్తోంది. బయట చాలా సరదాగా తనకు ఇష్టమైన రీతిలో ఆమె కనిపిస్తోంది.

ఇటీవల పలు ఫంక్షన్లకు హాజరయ్యే నటీమణులు ఇలానే దర్శనిమిస్తున్నారు. ఇటీవలే టబు ఓ ఫంక్షన్లో నల్లటి చిన్న గౌన్‌తో కాళ్లను, పైన చెస్ట్‌ను ఎక్స్‌పోజింగ్ ఇచ్చేసింది. ఇక తాజాగా కమిలినీ గమ్యం ప్రివ్యూకు ఐమాక్స్‌లో రాత్రి పదిన్నర గంటలకు హాజరైంది. ఆమె ఎవరనేది ముందుగా ఎవరికీ అర్థం కాలేదు. ఆమె ధరించిన దుస్తులు చూస్తే... మొత్తంమీద సెమీ న్యూడ్‌గా ఉన్నాయి.

లైట్ పింక్ కలర్ లో పల్చటి గౌన్ తో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్, లేదా ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కు వచ్చినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానించుకోవటం కొసమెరుపు. ఇంతకన్నా తెరపై ఎక్స్‌పోజింగ్ చేసే మధుశాలిని, రుతిక వంటి సెక్సీ తారలు బయటకు వస్తే ఎంతో పొందికగా ఉంటారని అక్కడివారు గొణుక్కోవటం కనబడింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT