1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

టాలీవుడ్‌కు మలయాళ ముద్దుగుమ్మ గుడ్‌బై..!

మలయాళ ముద్దుగుమ్మ నయనతార టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు వార్తలు
FileFILE
మలయాళ ముద్దుగుమ్మ నయనతార టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తెలుగులో నటించేందుకు ఆమె ఒక్క చిత్రానికి కూడా సంతకాలు చేయకపోవడం గమనార్హం. టాలీవుడ్‌ చిత్ర సీమ నుంచి తప్పుకునేందుకే ఆమె ఒక్క చిత్రానికి కూడా సంతకాలు చేయక పోవడం ప్రధాన కారణమని రాజధాని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే అటు తమిళంలో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే "కుచేలన్" చిత్రంతో పాటు మరో నాలుగు భారీ చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేయడం గమనార్హం. దీనికి తోడు తెలుగులో త్రిషా, శ్రేయాలు నయనతారకు గట్టి పోటీనిస్తున్నారు. ఇప్పటికే మంచిపోటీగా ఉన్న ఆసిన్ బాలీవుడ్‌లో స్థిరపడేందుకు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో నయనతార తమిళంపైనే మనస్సు లగ్నం చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళం అత్యంత సురక్షితమైన స్థావరంగా భావించినట్టు సమాచారం.
About Writer
PNR