1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఇంటర్నెట్‌లో ఐశ్వర్య అశ్లీల ఫోటో..!?

బాలీవుడ్ అందాల నటి
FileFILE
బాలీవుడ్ అందాల నటి, ప్రపంచ మాజీ విశ్వసుందరి, బిగ్ "బి" కోడలు ఐశ్వర్యారాయ్ అర్థనగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమయ్యాయట. దీంతో అమితాబ్ కుటుంబీకులు తీవ్ర మనస్థాపానికి లోనే వీటి నిలిపివేతకు అవసరమైన న్యాయపరమైన చర్యలపై దృష్టి సారించారని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంతేకాకుండా.. కొన్ని జాతీయ ఛానళ్లలో కూడా ఈ ఫోటోలు కొద్ది రోజుల క్రితం ప్రసారం కావడం కూడా బిగ్‌ బి కుటుంబసభ్యులు కలత చెందినట్టు సమాచారం.

ముఖ్యంగా ఇంటర్నెట్‌లో ఐష్ అర్థనగ్న ఫోటోలు ఉన్నట్టు వార్తలు గుప్పుమనడంతో వేలాది మంది నెటిజన్లు ఆ ఫోటల కోసం సెర్చ్ చేశారట. ప్రపంచ విశ్వ సుందరి కాకముందు.. ఐష్ మోడల్‌గా ఉన్న విషయం తెల్సిందే. తన వృత్తిలో భాగంగా.. 1990 సంవత్సరంలో సాటిమోడల్స్ రుచీ మల్హోత్రా, అనువర్మా, కోలీన్ ఖాన్, మిళింద్ సోమన్, మధు సప్రే‌లతో కలసి ఐశ్వర్య టాప్‌లెస్‌తో ఫోటోలు దిగారట.

ఆ సమయంలో వీరి ఫోటోలను ప్రముఖ ఫోటాగ్రాఫర్ అతుల్ కర్లేస్కర్ తీయగా, మోడల్స్‌కు మిక్కీ కాంట్రాక్టర్ మేకప్ చేశారు. ఈ విషయంతో ఖిన్నుడైన అభిషేక్ కలవరానికి గురయ్యారని, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలపై తన లాయర్లతో సంప్రదిస్తున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి