కరీనా.. సౌందర్య రహస్యం తెలుసా?
|
ఒక చిత్రం పాత్ర కోసం సన్నగా మారానని ఇందుకోసం ప్రత్యేకంగా డైటింగ్ చెయ్యలేదని ఉపన్యాసాలు ఇస్తోంది. తనకు ఇష్టమైనవన్నీ.. చక్కగా ఆరగించానని సెలవిచ్చింది. తాజాగా ఒక కాస్మెటిక్ బ్రాండ్ ఆవిష్కరణలో కరీనా తన సౌందర్య రహస్యాలను చెప్పుకొచ్చింది. సన్నబడటానికి పొరపాటున కూడా డైటింగ్ చెయ్యవద్దని నేటి అమ్మాయిలకు ఉచిత సలహా ఇస్తోంది. బరువు తగ్గాలంటే కొన్ని చిట్కాలున్నాయని వాటిని పాటిస్తే సరిపోతుందని అంటోంది.
అందులోభాగంగా.. బాగా నీరు త్రాగటం, పూర్తిగా శాఖాహారం తీసుకోవడం మంచిదని చెపుతోంది. తాను బరువు తగ్గటానికి ఇవే ముఖ్య కారణాలని కరీనా చెపుతోంది. శాఖాహారం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతోందంటుంది. "జబ్ వుయ్ మెట్" సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కరీనా ప్రస్తుతం మరో కొత్త చిత్రంలో నటిస్తుంది.
ఇందులో బికినీ/మిడ్డీ డ్రస్సుల్లో తన అందాలను ఆరబోసేందుకే అమె ఇలా సన్నగా మారిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. అందువల్లే కరీనా ప్రియుడు సైఫ్‌తో కలసి ఎక్కడకు వెళ్ళినా డేటింగ్ కంటే ఆమె డైటింగ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తోందని వినికిడి.
