"ఓం శాంతి ఓం" ముద్దుగుమ్మ అలిగిన వేళ...
Published: Sat, 22 Mar 2008 (09:42 IST)
"
బాలీవుడ్ బాద్‌షా" షారుక్ ఖాన్ సరసన నటించిన 'ఓం శాంతి ఓం'తో ముద్దుగుమ్మ దీపికా పడుకోనే రాత్రికి రాత్రే టాప్ హీరోయిన్ల రేసులోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే చెలామణి అవుతోంది. అయితే 'చాందిని చౌక్ టు చైనా' సినిమా నిర్మాతలు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారు. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, దీపిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుండగా హీరోహీరోయిన్లకు వేర్వేరు హోటళ్ళలో గదులను కేటాయించారు. ముఖ్యంగా బ్యాంకాక్‌లోనే అత్యంత ఖరీదైన హోటల్ ఫోర్ సీజన్స్‌లో అక్షయ్‌కు బస ఏర్పాటు చేసిన నిర్మాతలు ఆ హోటల్‌లో సగం చార్జీ వసూలు చేసే గ్రాండ్ సుఖుంవిత్‌లో బస ఇచ్చారు. మిగతా యూనిట్ సభ్యులు కూడా అదే హోటల్‌లో ఉన్నప్పటికీ అక్షయ్ ఉన్న హోటల్‌లో తనకు రూమ్ ఏర్పాటు చేయక పోవడం దీపికకు మనస్థాపం కలిగించిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిర్మాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల దీపికా కాస్త మనస్థాపం చెందినట్టు సమాచారం.
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.....
మరింత చదవండి