1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అల్లు అర్జున్ సరసన త్రిష

తెలుగు కండల హీరో అల్లు అర్జున్ సరసన నటి త్రిష
FileFILE
తెలుగు కండల హీరో అల్లు అర్జున్ సరసన నటి త్రిష నటించనుంది. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించి సూపర్ హిట్టయిన 'జబ్ వుయ్ మెట్' సినిమా దక్షిణాది భాషల రీమేక్ హక్కులను పేరుపొందిన సీడీ, డీవీడీల తయారీ సంస్థ మోజర్ బేర్ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షనులో మొదట ఆ సంస్థ త్రిష, ఉదయ్ కిరణ్‌లను ఎంచుకుంది. అయితే ఉదయ్ కిరణ్ ఇటీవల కాలికి గాయంతో షూటింగులకు దూరం కావడంతో అతని స్థానంలో హీరోగా అర్జున్‌ని మోజర్ బేర్ సంస్థ సంప్రదించింది.

దీనికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొన్న 'స్టాలిన్' చిత్రంలో చిరంజీవి సరసన నర్తించిన త్రిష, ఇప్పుడు ఆయన మేనల్లుడు అర్జున్‌తో సయ్యాటకు రెడీ అంటోందన్న మాట. ఈ కాంబినేషన్‌తో సినిమా వస్తే మాత్రం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
About Writer
PNR