1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఫర్జానా.. భువనేశ్వరి చెరో పది... ఉదయభాను ఆరు లక్షలు

ఫర్జానా... భువనేశ్వరి ఉదయభాను ఆరు లక్షలు
WD
'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా'తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బొద్దుగుమ్మ ఫర్జానా తన పారితోషికాన్ని ఎకాఎకిన 10 లక్షల రూపాయలకు పెంచేసింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఫర్జానా అందాల ప్రదర్శనకు అడ్డుచెప్పకపోవటంతో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

అల్లరి నరేష్‌తో 'సీమశాస్త్రి'లో నటించిన ఫర్జానా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో నిర్మాతలు ఫర్జానాపై తమ దృష్టిని సారించారు. ఇదిలా ఉంటే మరో హాటు భామ భువనేశ్వరి సైతం ఇంచుమించు ఇదే రేటును అడుగుతోందట. మరోవైపు పాపులర్ యాంకర్, ఐటెం డాన్సర్‌గా చేస్తున్న ఉదయభాను కూడా పాటకు ఆరు లక్షల రూపాయలను డిమాండ్ చేస్తోందని సమాచారం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT