1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఆగస్టులో "మెగాస్టార్" పాదయాత్ర?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖరారైనట్టుగా
FileFILE
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే అండర్‌గ్రౌండ్ హోం వర్క్‌ను దశలవారీగా పూర్తి చేసిన చిరంజీవి తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఈనెల ఏడో తేదీన అధికారిక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రకటన చేసేముందు ఆయన తిరుమల శ్రీనివాసుని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన 7వ తేదీన తిరుమలకు వెళ్లనున్నారు. ఈ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు.

ఈ పాదయాత్రకు తన పుట్టిన రోజైన ఆగస్టు 22వ తేదీని ముహుర్తంగా ఖరారు చేసుకున్నట్టు తాజా సమాచారం. తొమ్మిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనకు కూడా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్.రాజశేఖర రెడ్డి... వేలాది కిలోమీటర్ల దూరం చేపట్టిన పాదయాత్రతో చరమగీతం పాడిన విషయం తెల్సిందే. మెగాస్టార్ కూడా ఆ బాటనే ఎంచుకున్నారు. మొత్తం మీద "స్వయంకృషి"తో చిత్రసీమలో "చక్రవర్తి"గా వెలుగొందుతున్న చిరంజీవి.. రాజకీయాల్లోను "విజేత"గా నిలవాలని ఆకాంక్షిద్దాం.
About Writer
PNR