సినిమా వారిని వివాహమాడను: సాక్షి
|
ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ మీడియాతో మాట్లాడుతూ.. హీరోలు జగపతి, చక్రవర్తిలపై ఉన్న మంచి భావనతోనే తాను ఐటం సాంగ్ చేసేందుకు అంగీకరించినట్టు చెప్పింది. అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న వారిలో 95 శాతం మంచివారు కాదని, కేవలం ఐదు శాతం మంది మాత్రమే సత్‌ప్రవర్తన కలిగి ఉంటారని సాక్షి శివానంద్ అభిప్రాయపడింది. ఈ భామ లోగడ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన "సింహరాశి" చిత్రంలో చివరి సారి నటించింది. ఆ తర్వాత సాక్షికి తెలుగులో సరైన అవకాశాలు లేకపోవడంతో తెలుగు వెండితెరకు దూరమైంది.
