ఇలియానా పారితోషికం రూ. 1.50 కోట్లు
Publish: Thu, 10 Apr 2008 (18:50 IST)
Updated: Thu, 10 Apr 2008 (18:46 IST)
ఐటీ అధికారులు టాలీవుడ్ సినీ పరిశ్రమలోని పాపులర్ సినీ నటీనటులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య మహేష్ బాబు, నిర్మాత రాజు తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇదిలా ఉంటే... టాలీవుడ్ సెక్సీక్వీన్ ఇలియానా తన పారితోషికాన్ని కోటీ 50 లక్షలు చేసినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఐటీ తన చూపును అటు మరల్చినట్లు టాలీవుడ్ సినీజనం అంటున్నారు. భలేదొంగలు చిత్రానికిగాను ఇలియానా కోటిన్నర తీసుకున్నట్లు సమాచారం. అలాగే జల్సాకు సైతం భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు తెలిసింది. ఐటీ రిటర్న్స్‌లో తాను హైదరాబాదులో కోటిన్నర విలువచేసే ప్లాటును కొనుగోలు చేశానని ఇలియానా తెలిపినట్లు సమాచారం.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT