ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీరాజాస్మిన్‌కు కోపం... షూటింగ్‌కు బ్రేక్
Meerajasmin
WD
ఇటీవల ఓ షూటింగ్ సందర్భంగా చిత్ర నిర్మాతపై మీరాజాస్మిన్‌కు పీకల్దాకా కోపమొచ్చింది. ఇంకేముంది డైరెక్టర్ పేకప్ చెప్పకముందే ఆమాటేదో తానే చెప్పేసి మీరాజాస్మిన్ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది.

ఇంతకీ విషయమేంటంటే పృథ్వీరాజ్ హీరోగా రూపొందుతోన్న ఓ మలయాళ చిత్రంలో మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పిళ్లై కెమెరా‌మెన్‌గా పనిచేస్తున్నారు.

అసలు సమస్య ఇక్కడే వచ్చింది. సదరు కెమెరామెన్ తన సహాయకునిగా జార్జ్‌ను వెంటబెట్టుకొచ్చాడు. జార్జ్‌ను చూసిన మీరాజాస్మిన్‌కు కోపం రావడంతో షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది.

జార్జ్‌ను చూస్తే మీరాజాస్మిన్‌కు కోపం రావడమేంటని విచారిస్తే జార్జ్ మరెవరో కాదు, మీరాకు స్వయానా సోదరుడే. సోదరుణ్ణి చూసి సోదరి కోపగించుకోవటమేమిటని అనుకుంటున్నారా!

మీరాకు ఆమె కుటుంబానికి ఆ మధ్య బాగా గొడవలు రావడంతో మీరా ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోందట. అందుకే తన కుటుంబ సభ్యుల్ని ఎవర్ని చూసినా మీరాజాస్మిన్‌ ఫైర్ అయిపోతోందట.

సినిమాల్లో మీరాజాస్మిన్ నవ్వుతూ హుషారుగా కన్పించినా ఆమె జీవితంలో మాత్రం కష్టాలు ఓదానివెంట ఒకటిగా వస్తూనే ఉన్నాయని ఆమె సన్నిహితులు తెగ ఫీలైపోతున్నారు.

ఆ మధ్య రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న గోరింటాకు చిత్రం షూటింగ్ సందర్భంగా మీరాపై తేనెటీగలు దాడి చేయడంతో ఆమె స్వల్పంగా గాయపడిందన్న విషయం వినే ఉంటారు. దీన్నిబట్టి చూస్తే మీరాకు కష్టాలు మనకన్నా కాస్త ఎక్కువే కాబోలు అన్పిస్తోంది కదూ.
మరిన్ని
ఇలియానా పారితోషికం రూ. 1.50 కోట్లు
సినిమా వారిని వివాహమాడను: సాక్షి
రజనీకాంత్ నిరాహారదీక్షలో పాల్గొంటారా?
నయనతార నృత్యానికి 60 లక్షలు
ఆగస్టులో "మెగాస్టార్" పాదయాత్ర?
వచ్చే ఏడాది "చిరుత" వివాహం?